NGKL: ఊరుకొండపేట శివారులోని సూర్యలత కాటన్ మిల్లు కార్మికుల సమ్మె బుధవారం నాలుగో రోజుకు చేరింది. డిమాండ్లు పరిష్కారంకాకుండా విధుల్లో చేరేది లేదని వారు తెలిపారు. మిల్లు ఎదుట వంటావార్పు నిర్వహించారు. సీఐ నాగార్జున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యాజమాన్యం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.