NLG: గణిత ప్రతిభా పోటీల్లో చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి దీపక్ రెడ్డి ఫస్ట్ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. డీఈవో బిక్షపతి చేతుల మీదుగా ఇవాళ సర్టిఫికెట్, మెమొంట్తో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. టీఎంఎఫ్ వారు దశరధ ఫౌండేషన్ సహకారంతో ఈ పోటీలను జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించారు.