NLG: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారా పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో 3 కౌంటర్లు ఏర్పాటు చేసి, ఉదయం 6 గంటలకే విక్రయాలు ప్రారంభించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.