VSP: 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పరిషత్ బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మంగళవారం జిల్లా పరిషత్ విశాఖపట్నం సర్వసభ్య సమావేశం చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. 2025–26 సవరణ బడ్జెట్‌తో పాటు 2026–27 అంచనా బడ్జెట్‌కు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం టీ20 ఉమెన్ బ్లైండ్ క్రికెట్ జట్టు సభ్యురాలు పొంగి కరుణకుమారిని సత్కరించారు.