KNR: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామివారిని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ ఛైర్మన్ ఇంగిలి రామారావు శాలువాతో సత్కరించారు. అనంతరం భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.