GDWL: కేటిదొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల గర్భాలయానికి ధరూర్ మండలం ఖమ్మంపాడుకు చెందిన డాక్టర్ నర్మదా, రాజశేఖర్ రెడ్డి దంపతులు రూ.1.50 లక్షల విలువైన తలుపులను చేయించారు. మంగళవారం ఆలయంలో జరిగిన కార్యక్రమంలో దాతలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాతో సత్కరించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.