PLD: పెదమక్కెన, ఫణిదం గ్రామాల్లో మంగళవారం రీ–సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు గ్రామ రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సభలో తహసీల్దార్ కే.ఎస్. చక్రవర్తి, పాల్గొని రీ–సర్వే విధానం, రైతులు పాటించాల్సిన అంశాలను వివరించారు. అనంతరం రీ–సర్వే అవగాహనా ర్యాలీ నిర్వహించారు.