VZM: ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా రామతీర్థం పుణ్యక్షేత్రంలో జరిగిన ఉత్తరద్వార దర్శనం, గిరి ప్రదిక్షణ, సీతారామ స్వామి వారి కళ్యాణ్యమహోత్సవం కార్యక్రమాలకు నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు.