TG: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ -విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 14 వరకు HYD నుంచి విజయవాడ వెళ్లేవారికి.. జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ-హైదరాబాద్ వచ్చే వారికి అనుమతివ్వాలన్నారు.