KRNL: మంత్రాలయం మండలం పాతవూరు లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రాలయం MLA వై. బాలనాగిరెడ్డి, కాచాపురం సర్పంచ్ జయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ.నరసింహమూర్తి స్వామి స్వాగతం పలికారు. వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలతో స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.