MDK: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్లో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో 21 మండలాలలో నిర్వహించిన మండల స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, గణిత టాలెంట్ టెస్ట్ మొదటి మూడు స్థానాలలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా విద్యాధికారి విజయ, అధికారులు పాల్గొన్నారు