STPT: విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోదాడ ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్ అన్నారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని దొరకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ అమలు, శుభ్రత అంశాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.