PDPL: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో జాప్యం లేకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అధికారులను ఆదేశించారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందాల్సిన లబ్ధిపై కమిటీ సభ్యులతో చర్చించారు.