KMM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో సీపీఎం పాలేరు డివిజన్ వర్క్ షాప్ జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోవు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు.