SRPT: మట్టపల్లి మహాక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం అనంతరం రాజ్యలక్ష్మి, చెంచు లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలంకరించిన గరుడ వాహనంపై గ్రామ పురవీధులలో ఘనంగా ఊరేగించారు. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.