దుబాయ్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించే భారీ జరిమానాలు SMలో చర్చనీయాంశంగా మారాయి. అక్కడ అతివేగానికి రూ.5,73,500 వరకు, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడితే రూ.19,500 వరకు జరిమానాలు విధిస్తున్నారు. భారతదేశంలో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలాంటి నిబంధనలు కావాలని కొందరు కోరుతున్నారు. అయితే, ముందు దుబాయ్ తరహా అత్యుత్తమ రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని కామెంట్స్ చేస్తున్నారు.