బెంగాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, చొరబాటుదారులు బెంగాల్లో ఉన్నారని అమిత్‌షా అన్నారని, వారు ఇక్కడ ఉంటే పహల్గాంలో దాడి చేసింది ఎవరని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే ‘SIR’ పేరుతో కుట్ర పన్నుతోందని ఆరోపించారు.