ATP: వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ జిల్లాలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో భక్తులకు ప్రశాంత దర్శనం కల్పించేందుకు SP జగదీష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం పాతవూరు చెన్నకేశవ స్వామి, రైల్వే ఫీడర్ రోడ్డు వేంకటేశ్వర స్వామి ఆలయాలను ఆయన సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.