E.G: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీమంత్రి తానేటి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్న బాబు మంగళవారం దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నారు.