భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చారంటూ భారతీయ మూలాలున్న రికీ గిల్‌కు ట్రంప్ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డును నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయనకు అందించింది. ఈ రికీ గిల్.. ప్రస్తుతం ట్రంప్‌నకు ప్రత్యేక సహాయకుడిగా ఉన్నారు.