KMM: నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఖమ్మం ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ సూచించారు. యువకులు బైక్ మీద ప్రమాదకర విన్యాసాలు, అతి శబ్దాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. అటు మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.