KNRL: కాకినాడలో నిర్వహించిన సౌత్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీల్లో జొన్నగిరి గ్రామానికి చెందిన బి. హనుమేష్ ఉత్తమ ప్రతిభ చట్టాడు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి డి. రమేష్ హనుమేష్ను శాలువాతో మంగళవారం సత్కరించారు. జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్,గ్రామ ప్రజలు పాల్గొని, అభినందించారు.