NLG: అంతయ్య గూడెం సర్పంచ్ లక్ష్మయ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సర్పంచ్‌తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోమటిరెడ్డితోనే సాధ్యమని వారు పేర్కొన్నారు.