MHBD: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్ తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కోసం మొక్కులు చెల్లించుకున్నారు.