TG: గోదావరి- బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కమిటీ వేశారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆ కమిటీకి చంద్రబాబుకు శిష్యుడైన ఆదిత్యనాథ్ దాస్‌ను అధ్యక్షుడిగా వేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఏవిధంగా చెల్లించుకుంటున్నారో.. తెలంగాణ ప్రజలు గమించాలని కోరారు. ఈ కమిటీలో ఏడుగురు ఉన్నారని.. వారంతా ఏపీకి సంబంధం ఉన్నవారే అని మండిపడ్డారు.