‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీలో కొత్తగా కనిపించడం కోసం చిరంజీవి చాలా కష్టపడ్డారని చెప్పాడు. ఆయన లుక్ చూసిన వారంతా చరణ్‌కు తమ్ముడా అని అడుగుతున్నారని తెలిపాడు. ముఖ్యంగా సెట్లో అందరూ చిరు యూత్ ఫుల్‌గా ఉన్నారని చెబుతుండేవారని, అందుకే రోజూ దిష్టి తీయించుకోండి అని ఆయనకు చెప్పానని పేర్కొన్నాడు.