సత్యసాయి జిల్లాలో 2025లో నేరాల నియంత్రణపై SP సతీష్ కుమార్ వార్షిక నివేదిక విడుదల చేశారు. జిల్లాలో హత్యలు, కిడ్నాప్‌లు తగ్గుముఖం పట్టాయని, రోడ్డు ప్రమాద మరణాలు 11% తగ్గాయని వెల్లడించారు. హిందూపురం బ్యాంక్ దోపిడీ కేసులో రూ. 5.5 కోట్ల బంగారం రికవరీ చేయడం ప్రధాన విజయమని పేర్కొన్నారు. మహిళల భద్రతకు శక్తి టీంలు, అత్యాధునిక సాంకేతికతతో నిఘా పెంచామని తెలిపారు.