KNR: మండల, క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ అధికారులు ప్రతిరోజు యూరియా సరఫరాపై పర్యవేక్షించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 4246 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.