WNP: వనపర్తి డిపో పరిధిలో బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎం దేవేందర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సలహాలు సూచనలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని సెల్ నం. 9959226289కు ఫోన్ చేయాలని సూచించారు.