KRNL: మద్దికేర మండలానికి చెందిన బీరప్ప, లలిత దంపతుల కుమార్తె ఉప్పర శివానిని మంగళవారం ఆర్డీవో భరత్ నాయక్, తహసీల్దార్ గుండాల నాయక్ ఘనంగా సత్కరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శివాని ప్రతిభను గుర్తించి ఆమెను మంగళవారం అభినందించారు. శివాని కోరికలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని అధికారులు భరోసా ఇచ్చారు.