ATP: పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసినట్లు CM చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మండిపడ్డారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసులపై నిలదీశారు. నిరసన తెలిపిన 23 మంది నేతలపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోలీసులతో దాడులు చేయించడం సరికాదన్నారు.