TG: ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ద్రోహి రేవంత్ రెడ్డే.. ఇవాళ నీళ్ల ద్రోహి కూడా ఆయనే అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యమంలో ఆయన రాజీనామా చేయలేదు.. జై తెలంగాణ అనలేదు అని మండిపడ్డారు. చంద్రబాబు మనిషి ఆదిత్యనాథ్ దాస్‌ను రేవంత్ రెడ్డి సలహాదారుగా ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అని ఉద్ఘాటించారు.