కృష్ణా: జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సమాజంలో భవనం నిర్మాణ రంగం ప్రాముఖ్యమైనదని, బిల్డింగ్ వర్కర్ తాపీ పని చేస్తూ.. మన ఇళ్లను సుందరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు.