MDK: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులుగా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట సర్పంచ్ శివగోని పెంట గౌడ్ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన రాష్ట్ర సర్పంచుల సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. అలాగే మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ చీర్ల అనూష భాస్కర్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు.