SRPT: రాష్ట్ర పశువైద్య శాఖ, జిల్లా మైహోం ఇండస్ట్రీస్ సంయుక్తంగా చౌటపల్లి గ్రామంలో ఉచిత మహా పశు వైద్య శిబిరాన్ని రేపు (బుధవారం) నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో పశు, గర్భకోశ, గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలకు ఉచిత పరీక్షలు, చికిత్సలు, రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు అందించబడతాయి. పశుపోషకులు ఈ అవకాశం వినియోగించుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖాధికారులు కోరారు.