ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, అనుమతులు సత్వరమే మంజూరు చేయాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన 65వ పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ యూనిట్లకు సంబంధించి సుమారు రూ. 2.82 కోట్ల రాయితీలను మంజూరు చేశారు.