BHPL: గోరికొత్తపల్లి మండలం కోనరావుపేట మీదుగా పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు ఇవాళ గుర్తించారు. MLG జిల్లా అబ్బాపురం, జాకారం, పందికుంట, మల్లంపల్లి ద్వారా పాకాల అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అడవికి వెళ్లరాదని, BHPL జిల్లాల అటవీ అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.