ATP: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ప్రజలు నిబంధనలకు లోబడి జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రజలకు సూచించారు. వేడుకలు రాత్రి ఒంటి గంటలోపు ముగించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.