GNTR: పెదనందిపాడు మండలం పమిడివారిపాలెంలో మంగళవారం ఏవో సుబ్రహ్మణ్యం, శాస్త్రవేత్త మనోజ్ పంటలను పరిశీలించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు, అపరాల్లో రసం పీల్చే పురుగుల నివారణకు తగిన మందులు వాడాలని రైతులకు సూచించారు. ధాన్యం తేమ 17% లోపు ఉంటేనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని ఏవో స్పష్టం చేశారు.