వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. 31తేదీన రాత్రి ముమ్మర పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తామని మంగళవారం తెలిపారు. వేడుకలు 12.30 గంటలలోపు ముగించాలి,కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని నిబంధన అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.