AP: కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రెయిన్ ముంపు వల్ల కొబ్బరితోటలు పాడవుతున్నట్లు గుర్తించారు. దీంతో కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పవన్ శ్రీకారం చుట్టారు.