కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి హోళగుంద మండలంలోని చౌకదరాల రేషన్ షాపు నెం.03ను మంగళవారం తనిఖీ చేసి, రేషన్ పంపిణీ ఎలాంటి అక్రమాలు లేకుండా, పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. కార్డుదారులకు నాణ్యమైన సరుకులు అందేలా, వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ డెలివరీ విధానం 100% అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.