MBNR: నవాబుపేట మండలం కారుకొండ గ్రామంలో గుంతల రోడ్ల కారణంగా స్థానికులు గత కొన్ని సంవత్సరాలుగా భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం కొత్త సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగానే రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.