CTR: పూతలపట్టు గువ్వల కాలనీలో గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. పలువురు గ్రామస్తులకు శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు.