GNTR: ఈ ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో గుంటూరు పోలీసు గణనీయమైన పురోగతి సాధించింది. మొత్తం 102 సైబర్ కేసులు నమోదు కాగా, ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితులు నష్టపోయిన రూ.1,47,65,239ను సంబంధిత బ్యాంకులు, అధికారులతో సమన్వయం చేసి తిరిగి బాధితులకు అందించారు. గత ఏడాదితో పోలిస్తే కేసులు 10% తగ్గడం గమనార్హం.