బంగ్లాదేశ్లో హిందూవులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. భజేంద్ర బిశ్వాస్ అనే యువకుడిని నూమన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నూమన్ మియాను అరెస్ట్ చేశారు. కాగా.. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యలు మరువక ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.