NGKL: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పోలీసులు ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. నాగర్‌కర్నూల్, పాలెం, వట్టెం ప్రాంతాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయాల ఆవరణలో డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏఆర్ ఏఎస్సై మనోహర్ తెలిపారు.