TG: కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా HYD నగరంలో ఈ నెల 31న మెట్రోరైలు వేళలను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటల వరకే చివరి మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.