SKLM: కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 35 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి మంగళవారం నియమక పత్రాలను అందజేశారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి మన్ననలను పొందాలని సూచించారు.