ICC టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల స్టార్ బ్యాటర్ షెఫాలి వర్మ నాలుగు స్థానాలు ఎగబాకింది. తాజాగా ఆరో ర్యాంక్‌కు చేరుకుంది. స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతోంది. రిచా ఘోష్ ఏడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. శ్రీచరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి 52వ స్థానంలో నిలిచింది.